గంగవరం (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: ఉద్యోగుల పట్ల వారి సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర ఉద్యోగుల సంఘాలు పిలుపుమేరకు మంగళవారం మండలంలోని ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులు నిర్వర్తించారు. రాష్ట్ర ఉద్యోగుల సంఘం రంపచోడవరం డివిజన్ ప్రధాన కార్యదర్శి జిలాని ఆధ్వర్యంలో రెవిన్యూ ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా ప్రకృతి వైపరీత్యాలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ పనిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగులకు రావలసిన పెండింగ్ డీఏ బకాయిలతో పాటు పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీమన్నారాయణ, డిప్యూటీ తహశీల్దార్ రామకృష్ణ, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







