UPDATED 25th MARCH 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణ, మండల పరిధిలోని గ్రామాలలో శ్రీ రామనవమి వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. స్థానిక 12,18 వార్డులు, మఠంసెంటర్ లో గల రామాలయాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, కంటే బాబు, యార్లగడ్డ చిన్ని, బడుగు శ్రీకాంత్, రెడ్నం సునీత, కంచర్ల,సుష్మ మోహిని, పసల పద్మ రాఘవరావు, గుణ్ణం రాజబ్బాయి తదితరులు పాల్గొన్నారు.







