UPDATED 24th SEPTEMBER 2019 TUESDAY 9:00 PM
గండేపల్లి (రెడ్ బీ న్యూస్): విద్యార్థులను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్ధేందుకే జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ 50వ వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువు మాత్రమే కాకుండా సమాజాన్ని కూడా అధ్యయనం చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో జీవన పరిస్థితులు, కుటుంబ వ్యవస్థ గురించి తెలుసుకునేందుకు ఎన్ఎస్ఎస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని అన్నారు. సమాజంలో సేవా దృక్పధాన్ని పెంపొందించడానికి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మంచి సారధులుగా వ్యవహరిస్తూ సమాజ అభివృద్ధికి అందించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛతే హీ సేవ కార్యక్రమంలో భాగంగా “యాంటీ ప్లాస్టిక్-ప్లాస్టిక్ నిషేధానికి తీసుకోవలసిన చర్యలు” అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం పోటీలలో పాల్గొన్న విద్యార్ధినీ, విద్యార్థులకు డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ ఎం.వి. హరనాధ బాబు, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభుప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ పి.ఆర్. ఫణీంద్ర, బి. సుధీర్, వివిధ విభాగాల అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.







