UPDATED 4th AUGUST 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: ఓటరు జాబితాకు సంబంధించి విధులు సక్రమంగా నిర్వహించలేదని కారణంతో పిఠాపురం మున్సిపల్ కమీషనరును జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణమోహన్ పిలుపు మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఉద్యోగులు మున్సిపల్ కార్యాలయం ఎదుట శనివారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్ కమీషనరుపై ఏమైనా చర్యలు తీసుకోవాలంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులకు మాత్రమే ఉందని, కమీషనరును సస్పెండ్ చేసే అధికారం కలెక్టరుకు లేదని, తక్షణం సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట మున్సిపల్ ఎంప్లాయిస్ అధ్యక్షుడు గిడుతూరి శ్రీనివాసరావు, మునిసిపల్ డిఇ సి.హెచ్. రామారావు, మేనేజర్ ఎస్. అచ్యుత్ రాజు, ఆర్ వో సి.హెచ్. వెంకటేశ్వర్లు, టిపివో రత్నాకర్, జెఎవో ఎన్.ఎల్. సంగీత మాధురి, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







