UPDATED 7th SEPTEMBER 2017 THURSDAY 4:00 PM
పెద్దాపురం: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని సంఘం పెద్దాపురం నియోజకవర్గ అధ్యక్షుడు బూరాడ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక మరిడమ్మ అమ్మవారి కాలక్షేప మండపంలో నిర్వహించిన సాధారణ సమావేశంలో ఆయన గురువారం మాట్లాడారు. సమిష్టి కృషి, ఐక్యతతోనే విజయం సాధించవచ్చని పేర్కొన్నారు. సమాజంలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. సంఘం గౌరవ అధ్యక్షుడు అడపా వెంకట్రావు, కార్యదర్శి రెడ్డిపల్లి రమణమూర్తి (బుల్లియ్య), రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాకుర్తి రాంబాబు, జిల్లా జాయింట్ సెక్రటరీ మాసా చంద్రరావు (చందు), ఈసీ మెంబర్ పి. వీరభద్రవర్మ మాట్లాడుతూ పాత్రికేయులు వారి హక్కులు సాధించుకునేందుకు పరస్పర సహకారంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని, అలాగే సామాజిక కార్యక్రమాల్లో సైతం భాగస్వాములు కావాలన్నారు. అనంతరం సంఘం బలోపేతానికి, భవిష్యత్ కార్యాచరణ మొదలైన విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు కొశెట్టి రాంప్రసాద్, కోశాధికారి బద్ది కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి దేవరకొండ సుధాకర్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా ఈసీ మెంబర్ రాజాశ్రీనివాస్, సహాయ కార్యదర్శి వినాయక్, సభ్యులు ఆలీ, వెంకట్, సుబ్రహ్మణ్యం (సుబ్బు), శ్రీకాంత్, ఎలిశెట్టి సత్యనారాయణ, రాజా కరెడ్ల, జ్యోతి ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.







