UPDATED 28th JANUARY 2019 MONDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ కె. లక్ష్మికి ఉత్తమ సేవా పురస్కారం లభించింది. 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతీ సంవత్సరం ఉద్యోగులకు ఉత్తమ అవార్డులు ఇస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఆమె సేవలను గుర్తించి ఈ పురస్కారం వరించింది. ఈ పురస్కారాన్ని జిల్లా వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారి డాక్టర్ టి. రమేష్ కిషోర్ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ సామర్లకోటలో వైద్యురాలుగా సేవలు అందిస్తున్నందుకు గాను నాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, అలాగే ఆసుపత్రి అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మిని ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, ఆస్పత్రి సిబ్బంది ఏసుదాసు, తదితరులు అభినందించారు.







