UPDATED 17th MAY 2019 FRIDAY 8:00 PM
పెద్దాపురం: గ్రామాల్లో త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎంపీడీవో పి. ఉమా మహేశ్వరావు అన్నారు. పెద్దాపురం మండలం పరిధిలో గల కట్టమూరు గ్రామంలో ఎల్&టి ఆర్ధిక సహాయంతో రూ.మూడు కోట్ల వ్యయంతో మూడు త్రాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించే నిమిత్తం ఎల్&టి సిబ్బందితో కలిసి ఎంపీడీవో గ్రామంలో స్థలాలను శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుందరపల్లి శివనాగరాజు, ఎంపీటీసీ అడపా గంగాధర్, పంచాయతీ కార్యదర్శి ఎస్. వెంకటరమణ, ఎల్&టి ఇంజనీర్ రామశ్రీకర్, సానిపిన వెంకటేశ్వరావు, యేలేటి సుబ్బారావు, పెట్లు వీర భద్రరావు, తదితరులు పాల్గొన్నారు.







