సైన్స్ ఫెయిర్ లో ప్రతిభా విద్యార్థుల హవా

UPDATED 27th FEBRUARY 2018 TUESDAY 7:30 PM

సామర్లకోట: ఫిబ్రవరి 28  సైన్స్ డేను పురస్కరించుకుని  పెద్దాపురం, సామర్లకోట రోటరీక్లబ్ ఆధ్వర్యంలో పెద్దాపురం పట్టణంలోని స్థానిక మహారాణీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన సైన్స్ ఫెయిర్ లో పట్టణంలోని ప్రతిభా విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ ప్రదర్శనలో సుమారు 70 మంది విద్యార్థులు పాల్గొనగా సీనియర్స్ విభాగంలో ఎనిమిదవ తరగతి విద్యార్థి బి.వి.ఎం. వర్షిత, వి.ప్రదీప్, ఎల్. సాయికృష్ణ, ప్రదర్శించిన ఏకో లైట్ కు ప్రథమ బహుమతి, జూనియర్స్ విభాగంలో ఏడవ తరగతి విద్యార్థి పి. యాశ్రూప్, ఎస్. సాయి రామకృష్ణ, ప్రదర్శించిన హైడ్రాలిక్ ప్రొక్లైనర్ కు ద్వితీయ బహుమతి పొందినట్లు ప్రతిభా విద్యానికేతన్ కరెస్పాండెంట్ ఎస్.వి.వి.జి. ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహారాణీ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరా ఆశాలతా పీటర్, ఫిజిక్స్ విభాగాధిపతి గంగాధర్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విజేతలను ప్రతిభా విద్యానికేతన్ అకడమిక్ డైరెక్టర్ రవికుమార్, ప్రిన్సిపాల్ టి. సునీత, పి.సుష్మ, తదితరులు అభినందించారు.     
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us