* జై భారత నేషనల్ పార్టీని గెలిపించండి
* డాక్టర్ గొరకపూడి చిన్నయ్య దొర
* పార్టీ సిద్ధాంతాలు నమ్మి పలువురు చేరిక
UPDATED 5th APRIL 2019 FRIDAY 6:00 PM
పెద్దాపురం/సామర్లకోట: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర ప్రచార దూకుడు పెంచారు. స్థానికేతరులను ఓడించాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఆయన పెద్దాపురం, సామర్లకోట, జె. తిమ్మాపురం, ఆర్బీ పట్నం, ఆర్బీ కొత్తూరు, కట్టమూరు గ్రామాల్లో శుక్రవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయా పట్టణాలు, గ్రామాలు, వార్డుల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థి డాక్టర్ గొరకపూడి చిన్నయ్య దొర తన ప్రచార జోరును పెంచారు. జై భారత్ నేషనల్ పార్టీ గుర్తు గాజులు గుర్తుపై ఓటువేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్ధించారు. జై భారత్ నాయకుల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తమ గ్రామాలకు వచ్చిన నాయకులకు స్థానిక మహిళలు బొట్టుపెట్టి మంగళ హారతులతో ఘన స్వాగతం పలుకుతున్నారు. స్థానికులు ఆయన చేస్తున్న ప్రచారానికి బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామాల్లోని ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండడంతో నాయకులు రెట్టింపు ఉత్సాహంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నయ్యదొర మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని, పెద్దాపురం నియోజకవర్గ అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోలేదని అన్నారు. అధికార దాహం కోసం ప్రాకులాడే నాయకులను ప్రజలు నమ్మవద్దని కోరారు. తమ పార్టీ అన్ని వర్గాల ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ప్రజలకు భరోసా ఇచ్చారు.
పార్టీలో పలువురు చేరిక..
జై భారత నేషనల్ పార్టీలో శుక్రవారం సుమారు 200 మంది పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీలో జాయిన్ అయిన వారికి డాక్టర్ చిన్నయ్యదొర కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దీంతో నియోజక వర్గంలో పార్టీకి బలం చేకూరింది. ఇక ఆయన విజయం తథ్యం అయినట్లే అని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జివివి సత్యనారాయణ, కె. అబ్బాస్, సత్యశ్రీ, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.







