ప్రాంగణ ఎంపికల్లో ఆదిత్య బిజినెస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

UPDATED 19th SEPTEMBER 2019 THURSDAY 8:00 PM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్):  గండేపల్లి మండలం  సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ కు చెందిన ఎంబిఏ, పిజిడిఎం విద్యార్థులు గురువారం జరిగిన ప్రాంగణ ఎంపికల్లో విశేష ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. హైదరాబాదుకు చెందిన ప్రముఖ కంపెనీ జెన్క్యూ సంస్థకు చెందిన మానవ వనరుల అధికారుల బృందం క్యాంపస్ కు విచ్చేసి ప్రాంగణ ఎంపికల ప్రక్రియలో భాగంగా నిర్వహించిన వ్రాత, మౌఖిక పరీక్షలలో ఎం. శ్రీగంగ, డివివిఎన్. సాయికుమార్, ఎం. మహిత మాన్వి, ఎస్.వి.డి. ఆశ్రితలు ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని తెలిపారు. ఉద్యోగాలు సాధించిన ఈ నలుగురు విద్యార్థులు హైదరాబాద్ లో పనిచేయవలసి ఉంటుందని, వీరికి వార్షిక వేతనం రూ. 2.4 లక్షలు లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఉద్యోగాలు సాధించడం కష్టతరం అవుతున్న నేటి పోటీ రంగంలో ఆదిత్య విద్యార్థులకు మొదటి సంవత్సరం నుంచి పాఠ్యంశాలతో పాటు ప్లేస్ మెంట్ ట్రైనింగ్ ద్వారా కంపెనీలకు అనుగుణంగా వివిధ రంగాలలో శిక్షణ ఇవ్వడం మూలంగా మంచి ఫలితాలు తమ విద్యార్థులు పొందుతున్నారని డాక్టర్ సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్ధాశర్మ, డాక్టర్ ఎన్. విశాలాక్షి, అధ్యాపక సిబ్బంది విద్యార్థులను  అభినందించారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us