UPDATED 8th MAY 2018 TUESDAY 7:00 PM
పెద్దాపురం (రెడ్ బి న్యూస్) : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సిపికి ఎదురులేదని, అలాగే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ అఖండ విజయం సాధించడం తథ్యం అని ఆ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కర్రి వెంకటరమణ అన్నారు. స్థానిక బ్యాంక్ కాలనీలో ఆయన స్వగృహంలో విలేఖరులతో మంగళవారం మాట్లాడారు. పెద్దాపురం నియోజకవర్గ కన్వీనర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ చాలా బలంగా తయారయ్యిందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీకి చెందిన అభ్యర్థులు అఖండ విజయం సాధించడం ఖాయం అన్నారు. ఇప్పటికే ప్రజల్లో తమ పార్టీకి మంచి ఆదరణ లభిస్తోందని, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా సాగుతున్నట్లు చెప్పారు. ఈనెలాఖరు నాటికి జిల్లాలో యాత్ర ప్రవేశించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే తమపార్టీ చేపట్టిన నవరత్నాలు పథకాలు ప్రజల్లోకి చేరాయని, అలాగే క్షేత్రస్థాయిలో పార్టీ చాలా బలంగా ఉందన్నారు. ప్రతీ కార్యకర్త పార్టీ కోసం సైనికుల్లా పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిందని, దీంతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు చెప్పారు. అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు తమ పార్టీవైపే మొగ్గు చూపుతున్నారని, ఇది తమ పార్టీకి కలిసివచ్చే మంచి అంశం అని అభిప్రాయపడ్డారు. అలాగే బిసిలకు న్యాయం తమ పార్టీవల్లే సాధ్యపడుతుందన్నారు. పెద్దాపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.







