డిసెంబర్ 20 నుంచి జ్ఞానభేరి కబడ్డీ పోటీలు

UPDATED 19th DECEMBER 2018 WEDNESDAY 5:00 PM

రాజానగరం: జ్ఞానభేరి కార్యక్రమంలో భాగంగా ఈనెల 20వ తేదీ నుంచి గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు గైట్ వ్యాయమ అధ్యాపకులు డాక్టర్ సి. మంజ్రేకర్ హెన్రీ తెలిపారు. ఈ సందర్భంగా విలేఖరులతో బుధవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 20వ తేదీ నుంచి రెండురోజుల పాటు జరిగే ఈ కబడ్డీ పోటీల్లో జిల్లావ్యాప్తంగా 31 పురుషుల జట్లు, 12 మహిళల జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ పోటీల్లో విన్నర్స్, రన్నర్స్ కు కాకినాడలో జరిగే జ్ఞానభేరి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బహుమతులు అందచేయడం జరుగుతుందని అన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత భోజన, వసతి సదుపాయాలు కళాశాల యాజమాన్యం ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయమ అధ్యాపకులు డి. సూర్యనారాయణ, పి. శివకుమార్, కోచ్ అప్పారావు దొర, తదితరులు పాల్గొన్నారు.           

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us