గైట్ లో ముగిసిన జ్ఞానభేరి కబడ్డీ పోటీలు

UPDATED 21st DECEMBER 2018 FRIDAY 9:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల క్రీడా మైదానంలో గత రెండురోజులుగా జరుగుతున్న జ్ఞానభేరి జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు శుక్రవారంతో ముగిశాయని, ఈ పోటీల్లో పురుషులు, మహిళా జట్లు పాల్గొన్నట్లు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సిఎం హెన్రీ తెలిపారు. మహిళల విభాగంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (రాజమహేంద్రవరం) విన్నర్స్ గా, ఎ.ఎస్.డి డిగ్రీ కళాశాల (అన్నవరం) రన్నర్స్ గా, పురుషుల విభాగంలో గైట్ కళాశాల, ఆదిత్య వ్యాయమ విద్యా కళాశాల జట్ల మధ్య జరిగిన ఫైనల్స్ లో ఆదిత్య కళాశాల జట్టు విన్నర్స్ గా, గైట్ కళాశాల జట్టు రన్నర్స్ గా నిలిచారన్నారు. గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ తొలుత క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మీశశివర్మ, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టివి ప్రసాద్, డాక్టర్ పిఎంఎంఎస్ శర్మ, డాక్టర్ పి. రామానుజం, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎస్ఎస్ఎన్ మూర్తి, డాక్టర్ లీలావతి, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us