ఆదిత్య విద్యార్థులకు ఉద్యోగాల వెల్లువ

UPDATED 11th OCTOBER 2018 THURSDAY 6:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ కు చెందిన 99మంది విద్యార్థులు పలు కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలు సాధించినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆదిత్య యాజమాన్యం కృషితో విద్యార్థులు ఈ విజయం సాధించారని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి అన్నారు. తమ సంస్థ ప్లేస్ మెంట్ విభాగం ద్వారా విద్యార్థులకు మొదటి సంవత్సరం నుంచి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తూ నేటి పరిశ్రమలకు అనుగుణంగా వారిని సన్నధం చేస్తున్నామని, ప్రతీ వారం వివిధ రకాల కాంపిటేటివ్ పరీక్షలు నిర్వహించి వారికి పోటీ పరీక్షలను ఎదుర్కొనే సామర్ధ్యాన్ని పెంపొందించడం ద్వారా నేడు వివిధ కార్పొరేట్ కంపెనీలలో మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు పొందారని అన్నారు. ప్రముఖ కంపెనీలైన కాప్ జెమినీ-56, జెన్ క్యూ-20, జిజికె టెక్-4, ఇన్ వెన్యూ బిజినెస్ సొల్యూషన్స్-3, యాజ్ టెక్ -7, దివామి-4, క్యాలిఫోర్-2, రిక్తం టెక్నాలజీస్-1, కేక టెక్నాలజీస్-2 లలో మొత్తం 99మంది విద్యార్థులు వార్షిక వేతనం రూ.7.20 లక్షల నుంచి రూ. 2.50 లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందారని తెలిపారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, ప్లేస్ మెంట్ విభాగాధిపతులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us