ముగిసిన జోనల్ గిరిజన క్రీడా పోటీలు

UPDATED 19th FEBRUARY 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా జరుగుతున్న జోనల్ గిరిజన క్రీడా పోటీలు సోమవారం ఘనంగా ముగిసాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్.ఎం. వనలత అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కౌన్సిలర్ ఊబా జాన్ మోజస్, ఎటిడబ్యువో సి.హెచ్. రామతులసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ప్రతి పాఠశాలలో విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే దేనినైనా సాధించగలరన్నారు. శారీరక మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఏడు మండలాల నుంచి 143 విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ముఖ్య అతిధులు ఊబా జాన్ మోజస్, ఎటిడబ్యువో సి.హెచ్. రామతులసి విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ సంక్షేమ అధికారి బి. లక్ష్మణరావు, సీబీయం వ్యాయామ ఉపాధ్యాయులు అనంత లక్ష్మి, కృష్ణ, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us