కాపుగంటికి డాక్టరేట్

UPDATED 1st JULY 2017 SATURDAY 10:00 PM

పెద్దాపురం : వెట‌ర్న‌రి లైవ్ స్టాక్ అసిస్టెంట్ గా ప‌నిచేస్తున్న కాపుగంటి కోటేశ్వ‌ర‌రావుకు గౌరవ డాక్టరేట్ లభించింది. ఈ మేరకు ఆయనకు సి ఎన్ టి డీమ్డ్ యునివర్సిటీ ఏటా ప్రకటించే హాన‌ర‌బుల్ డాక్ట‌రేట్ ను ఈ సంవత్సరం రినౌడ్ పొయెట్ గా కోటేశ్వ‌రావుకు ప్రకటించారు. ఈ యూనివర్సిటీ అమెరికా యునైటెడ్ థియ‌లాజిక‌ల్ రీసెర్చి యూనివర్సిటీ గుర్తింపు కూడా పొందినట్లు కోటేశ్వరరావు తెలిపారు. తనకు డాక్టరేట్ లభించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అలాగే గౌరవ డాక్టరేట్ పొందిన కోటేశ్వరరావును పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజాసూరిబాబురాజుతో పాటు పలువురు ప్రముఖులు అభినందించారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us