కిశోర వికాస పథకం విజయవంతం చేయాలి

UPDATED 2nd JANUARY 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: బాలికలకు బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, బాలలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు, బాలలను రక్షించేందుకు కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందని  సామర్లకోట అర్బన్ ఐసిడిఎస్ సిపిడివో పద్మావతి అన్నారు. స్థానిక ఐసిడిఎస్ కార్యాలయంలో  విలేఖరులతో బుధవారం ఆమె మాట్లాడుతూ బాల బాలికలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ చేపట్టిన కిశోర వికాస పథకం రెండవ విడత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈనెల మూడవ నుంచి ఐదో తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల బాల బాలికలకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులను చైతన్య పరచడానికి కిశోర  వికాస పథకం ఆరుగురు సభ్యులతో కూడిన ఒక టీమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ టీములో స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు యాళ్ల పద్మలత, అర్బన్ ఐసిడిఎస్ సిపిడివో, మానవహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, న్యాయవాది జంగం సంతోషకుమారి సభ్యులుగా ఉంటారని అన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us