UPDATED 8th DECEMBER 2018 SATURDAY 7:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలల అధ్యాపక సిబ్బందికి అవుట్-కమ్-బేస్డ్ ఎడ్యుకేషన్ వర్క్ షాప్ శనివారం నిర్వహించినట్లు ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్ & ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవుట్-కమ్-బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఒక విద్యా సిద్ధాంతమని, అంతర్జాతీయ విద్యా విధానాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ కళాశాలలు నడపడానికి ఈ పరిజ్ఞానం అవసరమని అన్నారు. అధ్యాపకుడు శిక్షకుడుగా విద్యార్థి లక్ష్యాలను చేరుకొనేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమై సాధన మార్గాన్ని చూపే మార్గదర్శకుడిగా ఉండాలని అన్నారు. ఒక విద్యాసంస్థ ఎన్.బి.ఏ, నాక్ వంటి సంస్థల గుర్తింపు పొందడానికి అధ్యాపక సిబ్బందికి అవుట్-కమ్-బేస్డ్ ఎడ్యుకేషన్ శిక్షణ తప్పనిసరని, ఈ శిక్షణ నిమిత్తం జెఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ నేతృత్వంలో అధ్యాపకులకు వర్క్ షాప్ నిర్వహించడం జరిగిందని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, ఇంజనీరింగ్ కళాశాలల వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, ప్రొఫెసర్ ఎ. రామకృష్ణ, వివిధ విభాగాధిపతులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.







