అమరులను స్మరించుకుందాం

గంగవరం (రెడ్ బీ న్యూస్) 1 నవంబర్ 2021: పీడిత జనవిముక్తి కోసం అసువులు బాసిన అమరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు బాదంపూడి బాబూరావు అన్నారు. బయ్యనపల్లిలో రైతుకూలీలతో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూమి, భుక్తికోసం ఈ దేశ విముక్తి కోసం కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి మొదలుకొని సుమారు అయిదు వేల మంది కామ్రేడ్స్ అమరత్వం పోందారని, ముఖ్యంగా నవంబరులో ముఖ్యనాయకులు అమరులైయ్యారన్నారు. అందుకే ఈ నెలంతా గ్రామ గ్రామాన అమరులను స్మరించుకుంటూ సభలు సమావేశాలు జరపాలని ఆయన పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈ నెల పదకొండవ తేదిన గంగవరంలో సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి డి. సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us