విద్యార్థుల్లో సామర్థ్యం పెంపునకు ప్రభుత్వం కృషి

UPDATED 28th JUNE 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట పట్టణ పరిధిలోని యస్‌ కొత్తూరు నెంబర్ 2, సత్యనారాయణపురం మున్సిపల్ ప్రాథమిక పాఠశాలల్లో చిట్టి చేతులు- చక్కని రాతలు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ డి. దేవానందరెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ఎంఈవో వైవి శివరామకృష్ణయ్య ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కొన్ని పాఠశాలలను కేటాయించి విద్యార్థుల అభ్యున్నతికి చర్యలు తీఎసుకున్నారు. దీనిలో భాగంగా స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల హెచ్ఎం  తోటకూర సాయి రామకృష్ణ విద్యార్థుల సామర్ధ్యాలను పరీక్షించారు. దీనివల్ల విద్యార్థుల సామర్ధ్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుందని, ప్రాథమిక విద్య బలోపేతం కావడానికి ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం. నాగేశ్వరరావు, కె.  లక్ష్మీ పార్వతి, డి. సూర్యనారాయణ, డి. వీరన్న, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us