ఆదిత్యలో ముగిసిన ఐవోటి వర్క్ షాప్

UPDATED 18th AUGUST 2018 SATURDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో గల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో నూతన విధానాలపై ఐవోటి (ఇంటర్ నెట్ ఆఫ్ థింక్స్) మూడురోజుల పాటు నిర్వహించిన వర్క్ షాప్ విజయవంతంగా ముగిసినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి   ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ ఐబి హబ్ ప్రతినిధి కావ్య పాల్గొని మాట్లాడారు. సమాచార రంగంలో వస్తున్న నూతన పోకడలు తదితర వాటి పరిష్కారానికి ఈ వర్క్ షాప్ ఎంతో దోహదపడిందని, ఐవోటి టెక్నాలజీ రానున్న రోజులలో ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ కార్యకలాపాలలో కీలకం కానున్నాయని అన్నారు. ఈ వర్క్ షాప్ లో ఆదిత్య, ప్రగతి, శ్రీప్రకాష్ విద్యా సంస్థలకు చెందిన సుమారు 120మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, విభాగాధిపతులు వానతి, ఎం. రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us