ఆదిత్యలో కాలేజ్ కనెక్ట్ అవగాహన సదస్సు

UPDATED 2nd AUGUST 2018 THURSDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో టి.వి.5  స్టూడెంట్స్ కాలేజ్ కనెక్ట్ అవగాహన సదస్సు ఈనెల్ మూడవ తేదీన నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి ఐ.టి సలహాదారు జె.ఏ.చౌదరి హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో భవిష్యత్ తరాల విద్యార్థులు ఉద్యోగ సముపార్జనలో ఎదుర్కొనే సవాళ్లు, వారికి గల అవకాశాలు అనే అంశంపై ఈ అవగాహన సదస్సు జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఐటి అకాడమీ డైరెక్టర్ విన్నీపాత్రో, తదితరులు పాల్గొంటారని సతీష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us