ఆన్ లైన్ క్లాసులు నిర్వహించే విద్యా సంస్థలపై చర్యలు తప్పవు

* జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహం

UPDATED 30th JUNE 2020 TUESDAY 9:00 PM 

కాకినాడ(రెడ్ బీ న్యూస్): జిల్లాలో ఆన్ లైన్ క్లాసులు నిర్వహించే విద్యా సంస్థలపై కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహం హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ఉధృతి నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల పునఃప్రారంభ తేదీని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదని అన్నారు. జిల్లాలో ఏ ఒక్క పాఠశాల కూడా ఆన్ లైన్ పేరిట తరగతులు నిర్వహించరాదని, అలాగే ఫీజులు చెల్లించమని విద్యార్థుల తల్లిదండ్రులను ఒత్తిడి చేయరాదని తెలిపారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే పాఠశాలల యాజమాన్యాలపై జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయములో ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. అలాగే ఇందు కోసం  కార్యాలయములో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విభాగం నెంబరు: 7382489375 కు ఫోన్ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. 

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us