అధ్యాపక అభివృద్ధి కార్యక్రమం ప్రారంభం

UPDATED 26th AUGUST 2019 MONDAY 8:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో ట్రిపుల్ ఈ, ఇ&ఐ సిటి అకాడమీ, ఎన్ఐటి (వరంగల్) సంయుక్త ఆధ్వర్యంలో రీసెంట్ ట్రెండ్స్ ఇన్ పవర్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్ ఇన్ స్మార్ట్ గ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ రినివబుల్ ఎనర్జీ అనే అంశంపై ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు ఆరు రోజులపాటు నిర్వహించు అధ్యాపక అభివృద్ధి శిక్షణా కార్యక్రమం సోమవారం ప్రారంభించినట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌర, పవన వంటి శక్తుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ శక్తితో కాలుష్యాన్ని తగ్గించవచ్చని, అంతేగాక విద్యుత్ వినియోగ లెక్కింపు పరికరంలో భాగమైన స్మార్ట్ మీటరుతో విద్యుత్ శక్తిని మరింత అనుకూలపరచవచ్చని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్  ఎస్. శంభుప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా అధ్యాపకులకు పరిశోధనా సంబంధమైన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి అవుతుందని, సౌర విద్యుత్ ఆధారిత వాహనాలు, సౌర వాయువు వంటి శక్తుల నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్ శక్తులతో భూమి ఉష్ణోగ్రత తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేనేజ్ మెంట్ ఎం. వి. హరనాథబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, డైరెక్టర్ అకడమిక్ డాక్టర్ జి. రఘురాం, డీన్-అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, కార్యక్రమ సమన్వయకర్త, ట్రిపుల్ ఈ విభాగాధిపతి డాక్టర్ కె. సత్యనారాయణ, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us