విధి నిర్వహణలో సేవలతోనే తగిన గుర్తింపు

UPDATED 16th AUGUST 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: ఉద్యోగులు తమ విధి నిర్వహణలో చేసిన సేవలే వారికి తగిన గుర్తింపునిస్తాయని సామర్లకోట మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ డి. మురళీధరరెడ్డి చేతుల మీదుగా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డులు అందుకున్న సామర్లకోట మున్సిపల్ కార్యాలయం ఉద్యోగులు డిఈ సిహెచ్ రామారావు, సీనియర్ అసిస్టెంట్ దుర్గారావు, సుజాతలను శుక్రవారం మున్సిపల్ కమీషనర్ సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవార్డు గ్రహీతలు అవార్డులను దృష్టిలో పెట్టుకొని మరింత ఉత్తేజంగా ప్రజలకు సేవలు అందించాలని, అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us