TS News: హైదరాబాద్‌ వాసులకు ‘న్యూ ఇయర్‌’ కానుక!

హైదరాబాద్‌ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: నగర వాసులకు శుభవార్త. నూతన సంవత్సరం కానుకగా షేక్‌పేట ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రానుంది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం కింద రూ.333.55 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 2.8 కిలోమీటర్ల ఈ బ్రిడ్జిని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. అత్యాధునిక హంగులతో ఆరు వరుసలతో నిర్మించిన ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పనున్నాయి. ఈ ఫ్లైఓవర్‌ బయోడైవర్సిటీ  జంక్షన్‌ నుంచి జేఎన్‌టీయూ జంక్షన్‌ వరకు 17 కిలోమీటర్ల మేర ఏ విధమైన  ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా సులభతరం చేస్తుందని జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం ప్రకటించింది

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us