ఓటర్ల నమోదుపై జిల్లా కలెక్టర్‌కు పురస్కారం

UPDATED 25th JANUARY 2019 FRIDAY 10:00 PM

కాకినాడ: జిల్లాలో ఓటర్లకు అవగాహన కల్పించడం, అర్హుల నమోదులో మెరుగైన ఫలితాలు సాధించినందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కార్తికేయమిశ్రాకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఎలక్టోరల్‌ ప్రాక్టీస్‌ పురస్కారం లభించింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి జాతీయ ఓటర్ల దినోత్సవంలో కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాకు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఈ పురస్కారాన్ని అందచేశారు. జనాభాలో ఓటర్ల నిష్పత్తి 730తో అత్యధికంగా 40,13,770 మంది ఓటర్లతో జాబితా సిద్ధం చేయడం, పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించడం తదితర అంశాలకు కలెక్టర్‌కు ఈ పురస్కారంతో పాటు రూ.25 వేలు, ప్రశంసా పత్రాన్ని గవర్నర్‌ అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ కలెక్టర్‌ను అభినందించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us