అజయ్ కల్లంకు శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి

UPDATED 19th JUNE 2020 FRIDAY 8:00 PM

అమరావతి(రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్య సలహాదారు అజయ్ కల్లంను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కర్రి వెంకటరమణ శుక్రవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈమేరకు ఆయనకు పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలియచేశారు. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపినట్లు వెంకటరమణ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల వద్దకే నేరుగా చేరేందుకు ప్రతిష్టాత్మకంగా గ్రామ, వార్డు సచివాలయం వ్యవస్థను ప్రవేశ పెట్టడం జరిగిందని, అర్హతను బట్టి అన్ని పథకాలు కూడా నేరుగా ప్రజల ఇళ్ల వద్దకు అందించేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నారన్నారు. ఈవిషయంలో ప్రభుత్వానికి సూచనలు చేయడంలో అజయ్ కల్లం విజయం సాధించారని ఆయన ప్రభుత్వానికి అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us