UPDATED 8th MARCH 2020 SUNDAY 9:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): భక్తుల పాలిట కొంగు బంగారంలా విరాజిల్లుతున్న పెద్దాపురం మండలం కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి పూల గరగల ఉత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి అల్లు వెంకట దుర్గాభవాని పర్యవేక్షణలో తొలుత అమ్మవారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని పూల గరగలతో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో దుర్గాభవాని మాట్లాడుతూ ఈనెల 23 నుంచి మే నెల 5వ తేదీ వరకు జరగనున్న అమ్మవారి జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె తెలిపారు. అమ్మవారి పూల గరగలు ఉత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు, పార్టీ నాయకురాలు తోట వాణి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.







