త్రివర్ణలో ఘనంగా యువజనోత్సవాలు

UPDATED 12th JANUARY 2018 FRIDAY 8:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో గల త్రివర్ణ పాఠశాలలో శ్రీ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువజనోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు  కరస్పాండెంట్  తోటకూర వెంకటేశ్వరావు తెలిపారు. ఈ సందర్భంగా వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించారు. విద్యార్థిని, విద్యార్థులచే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకే విధంగా విర్వహించారు. రంగవల్లులతో పాఠశాల ప్రాంగణమంతా నేలపై విరిసిన ఇంద్రధనుస్సులా మారింది. విద్యార్థులు పతంగులు ఎగురవేసి తమ ఉత్సాహాన్ని చాటారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణారావు, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us