సర్వమత సౌబ్రాతృత్వానికి ఆదిత్య ప్రతీక

UPDATED 26th NOVEMBER 2018 MONDAY 8:00 PM

గండేపల్లి: సర్వమత సౌబ్రాతృత్వానికి ఆదిత్య ప్రతీకని అవినీతి నిరోధక శాఖ రిటైర్డ్ డిజిపీ ఏ.కె. ఖాన్ అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణాన్నిఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్ ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్థులు రూపొందించిన వివిధ ప్రాజెక్టులు సందర్శించారు. విద్యార్థులు సృజనాత్మక శక్తికి పదునుపెడుతూ తయారుచేసిన వివిధ పరికరాలను ఆసక్తిగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకొని విద్యార్థులను అభినందించారు. క్యాంపస్ లో గల ఆధ్యాత్మిక ప్రాంగణం సరస్వతీ, సాయిబాబా దేవాలయాలు, చర్చి, మసీదులను దర్శించి ప్రత్యేక ప్రార్ధలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాన్ మాట్లాడుతూ తాను ఇంతవరకు సందర్శించిన ఏ విద్యాసంస్థలో కూడా అన్ని మతాలకు చెందిన మందిరాలు లేవని, సర్వమత సమానతను చాటుతూ సర్వ మత సౌబ్రాతృత్వానికి ప్రతీకగా ఆదిత్య క్యాంపస్ నిలిచిందని అన్నారు. అనంతరం ఆదిత్య యాజమాన్యం ఆయనను దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, తదితరులు ఉన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us