హుస్సేన్ పురంలో ఎల్ఎల్ఆర్ మేళా

UPDATED 18th JUNE 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద రవాణాశాఖ ఆధ్వర్యంలో ఎల్ఎల్ఆర్ మేళా సోమవారం నిర్వహించారు. మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ జి.వి. నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా రవాణాశాఖ అధికారిణి సిరి ఆనంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు మీ ముంగిట్లో రవాణాశాఖ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించడానికి రవాణా శాఖ సిద్దమైందని, 18 సంవత్సరాలు వయస్సు నిండిన యువత ఎల్ఎల్ఆర్ లైసెన్స్ కోసం రవాణాశాఖ కార్యాలయాలకు వెళ్లనవసరం లేదని, ప్రజల వద్దకే అధికారులు వచ్చి ఈ లైసెన్స్ చేయించి చేతికి అందిస్తారని అన్నారు. ప్రజలందరికీ రవాణాశాఖ సేవలు మరింత చేరువయ్యేందుకు ఈ మేళాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఎల్ఎల్ఆర్ లైసెన్సులు జారీ నిమిత్తం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరీక్షలు నిర్వహించి అనంతరం ధ్రువపత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు చల్లా బుజ్జి, మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్లు, రవాణాశాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.           
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us