UPDATED 11th OCTOBER 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక లయన్స్ క్లబ్ సభ్యురాలు ఎ. శాంతి గురువారం పేదలకు భోజనాలు ఏర్పాటు చేసి అనంతరం వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ తమకు తోచిన విధంగా తమ తమ ఆర్ధిక స్థితిని బట్టి ఎంతో కొంత పేదవారికి సహాయం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు కటకం గంగబాబు, ఆదినారాయణ రెడ్డి, కానుబోయిన విజయకృష్ణ, సేపేని సురేష్, తదితరులు పాల్గొన్నారు.







