UPDATED 15th OCTOBER 2018 MONDAY 6:30 PM
రాజానగరం: శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటుహక్కు పొందదలిచిన పట్టభద్రులందరూ ఫారం-18లో దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ కె.వి.వి. సత్యనారాయణరాజు (చైతన్యరాజు) కోరారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గతంలో ఓట్లు వేసిన పట్టభద్రులు కూడా తిరిగి ఓటు హక్కు నమోదు కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే 2015వ సంవత్సరం నవంబర్ ఒకటవ తేదీ నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు ప్రస్తుతం ఓటర్లుగా నమోదు అయ్యేందుకు అర్హులని అన్నారు. ఈ ఓటు హక్కు నమోదు గడువు నవంబర్ ఆరవ తేదీతో ముగుస్తున్నందున, గడువు తేదీలోగా అర్హత గల పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు కావాలని చైతన్య రాజు కోరారు.







