UPDATED 10th DECEMBER 2018 MONDAY 5:00 PM
పెద్దాపురం: పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మూడు అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు తెలిపారు. వీటిలో గండేపల్లి మండలం నీలాద్రిరావు పేట నుంచి పట్టాదారు పాస్ పుస్తకం కోసం ఒకటి, సూరంపాలెం నుంచి మైన్స్ కు సంబంధించి ఒకటి, తుని మండలం కుమ్మరిలోవ నుంచి ఆర్ అండ్ ఆర్ కు సంబంధించి ఒకటి అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు.







