UPDATED 15th MARCH 2018 THURSDAY 10:00 PM
సామర్లకోట: యువతిని మోసగించిన కేసులో వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 50 వేలు జరిమానా చెల్లించాలని కాకినాడ నాల్గవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పి. సాయిరాం గురువారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే సామర్లకోట మండలం వేట్లపాలెం గూడపర్తికి చెందిన జి. దుర్గా ప్రసాద్ అదే గ్రామానికి చెందిన యువతిని వంచించి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించగా అప్పటి ఎస్సై ఆలీఖాన్ కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడు దోషిగా నిర్ధారణ కావడంతో జైలుశిక్ష, జరిమానా విధించినట్లు సామర్లకోట ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.







