UPDATED 20th OCTOBER 2018 SATURDAY 10:00 PM
పెద్దాపురం: స్థానిక రామారావుపేటలో ఉన్న శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్‌లో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు శనివారం హోరాహోరీగా జరిగాయి. మూడవ రోజు జరిగిన పోటీల్లో ఇంటర్ ఇన్‌స్టిట్యూషనల్ మెన్ సింగిల్స్ విభాగంలో టి. శ్రీనివాసరాజు(ఈస్ట్ కోస్ట్ రైల్వేస్) ప్రథమ స్థానం, బి. బాలదుర్గారావు(ఈఎస్‌ఐ కార్పొరేషన్) రెండవ స్థానం సాధించారు. మెన్ టీమ్ విభాగంలో తూర్పుగోదావరి జిల్లా జట్టు ప్రథమ స్థానం, కృష్ణా జిల్లా జట్టు రెండవ స్థానంలో నిలిచాయి. విమెన్ విభాగంలో తూర్పుగోదావరి జిల్లా జట్టు ప్రథమ స్థానం, విశాఖ జిల్లా జట్టు రెండవ స్థానంలో నిలిచాయి. జూనియర్ బాయ్స్ టీమ్ విభాగంలో విశాఖ జిల్లా జట్టు ప్రథమ స్థానం, తూర్పుగోదావరి జిల్లా జట్టు రెండవ స్థానంలో నిలిచాయి. జూనియర్ గర్ల్స్ టీమ్ విభాగంలో విశాఖ జిల్లా జట్టు ప్రథమ స్థానం, తూర్పుగోదావరి జిల్లా జట్టు రెండవ స్థానంలో నిలిచాయి. ఈ పోటీలు టోర్నమెంట్ చీఫ్ రిఫరీ పి.వి.ఎస్. సూర్యారావు, డిప్యూటీ రిఫరీస్ డి.ఎస్. రమణకుమార్, వేణుగోపాల్ పర్యవేక్షణలో జరిగాయి. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల డైరెక్టర్ చిట్టూరి విజయప్రకాష్, సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, పాఠశాల సివోవో లెఫ్టినెంట్ కమాండర్ కె.ఎస్. రావు, వైస్ ప్రిన్సిపాల్ నీరా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.







