సంక్షేమాంధ్రప్రదేశ్ సాధనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

UPDATED 13th FEBRUARY 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: అన్ని వర్గాల ఆర్థిక, సామాజిక అభ్యున్నతితో విలసిల్లే సంక్షేమాంధ్రప్రదేశ్ సాధనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట మండలం అచ్చంపేట, బ్రహ్మానందపురం, కొప్పవరం గ్రామాల్లో మంత్రి బుధవారం పర్యటించి సుమారు రూ. కోటీ 58 లక్షల నిధులతో చేపట్టిన వివిధ ఆభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సంక్షేమ సహాయాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన తొలుత అచ్చంపేటలో రూ.9 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన వ్యాయామశాల, జిమ్ పరికరాలు, రూ.15 లక్షల నిధులతో పంచాయితీ భవనం, రూ.10 లక్షల నిధులతో డ్వాక్రా భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామంలో రూ.50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన కాపు భవన్ ను ప్రారంభించి, మండలంలోని స్వయం సహాయ బృందాల సభ్యులకు రూ.87 లక్షలు మేర పసుపు-కుంకుమ సహాయం చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం అచ్చంపేటలో రూ.5 లక్షల నిధులతో నిర్మించిన విశ్వబ్రాహ్మణ భవన్, రూ.5 లక్షల నిధులతో నిర్మించిన ఆయుష్ వెల్ నెస్ యోగా సెంటర్, రూ.2 లక్షల నిధులతో అభివృద్ధి చేసిన రచ్చబండ, రూ.15 లక్షలతో నిర్మించిన స్మశానం రోడ్డును మంత్రి ప్రారంభించారు. అనంతరం బ్రహ్మానందపురంలో రూ.5 లక్షల నిధులతో బిసి కమ్యూనిటీ హాలు, కొప్పవరంలో రూ.15 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు. అలాగే కొప్పవరం గ్రామంలో రూ.25 లక్షల నిధులతో వోహెచ్ఎస్ఆర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రత్యేక అధికారి వై. శ్రీహరిహరరావు, ఆయా శాఖల మండల, గ్రామస్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us