UPDATED 28th DECEMBER 2017 THURSDAY 9:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 28, 29 తేదీల్లో కళాశాల ఈఈఈ విభాగం, ఐఐటి బొంబాయి సౌజన్యంతో పిసిబి అండ్ సర్క్యూట్ డిజైనింగ్ ఆఫ్ మోడరన్ ఆటోమేటెడ్ సిస్టమ్స్ పై రెండురోజులు వర్క్ షాప్ నిర్వహిస్తునట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధునాతన సాంకేతిక అంశాలపై ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన కల్పించడానికి, పిసిబి అండ్ సర్క్యూట్ డిజైనింగ్ సాంకేతిక అంశాలను నేర్చుకుని వాటిని ఉపయోగించడానికి ఇటువంటి వర్క్ షాపులు ఎంతో దోహదపడతాయన్నారు. వివిధ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన 170 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మేనేజ్మంట్ ఎం.వి. హరనాధ బాబు, డైరెక్టర్ డాక్టర్ జి.రఘురాం, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి.నరేష్, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ మరియు ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ కె. సత్యనారాయణ, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.







