UPDATED 30th SEPTEMBER 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: పెద్దాపురం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన సీఎం కప్- 2018 క్రీడా పోటీల్లో మండల పరిధిలోని నవర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం సిహెచ్ సత్యవతి తెలిపారు. పెద్దాపురం మహారాణీ కళాశాలలో జరిగిన ఈ పోటీల్లో అండర్-14 బాలికల త్రోబాల్ విభాగంలో ఎస్. అమరావతి, కె. వెంకటలక్ష్మ, డి. అర్చన, ఆర్. అపర్ణ, జె. ప్రశాంతి, అలాగే అండర్-17 బాలుర వాలీబాల్ విభాగంలో కె. మణికంఠ, పి. నానిబాబు ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు ఎం. శ్రీనివాసరావు, జివివి సత్యన్నారాయణ, వ్యాయమ ఉపాధ్యాయులు ఎస్. జయలక్ష్మి, తదితరులు అభినందించారు.







