ప్రపంచానికి దేశం అందించిన బహుమతి యోగా

UPDATED 21st JUNE 2019 FRIDAY 9:00 PM

గండేపల్లి: ప్రపంచానికి మన దేశం ఇచ్చిన గొప్ప బహుమతి యోగా అని, ఆధునిక జీవనశైలి ప్రభావంతో మనిషి మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారని కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు అన్నారు. 
గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భగా కళాశాల ఛైర్మన్ డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ
మారుతున్న కాలంలో ప్రజలు ఒత్తిళ్లకు గురవుతున్నారని, దాని నుంచి విముక్తి పొందటానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రశాంత జీవనం సాగించాలంటే రోజూ గంటపాటు యోగా చేయాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ యోగా నేటి ఒత్తిడి జీవితంలో విద్యార్థులు, అధ్యాపకులకు స్ట్రెస్ థెరపీగా పనిచేస్తుందని, ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. మనిషి ఆరోగ్యంగా జీవనం సాగించడానికి యోగా ఉత్తమ మార్గమన్నారు. ప్రతీ ఒక్కరూ యోగాసనాలు వేయడం, ప్రాణాయామం చేయడం దినచర్యగా అలవాటు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కళాశాల యోగా ట్రైనర్, పిడి జి. దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు యోగాసనాలు వేసారు. ఈ కార్యక్రమంలో ఎన్.సి.సి ఆఫీసర్ లెఫ్టినెంట్ కమాండర్ జెడి నాయుడు, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ పి. రాజశేఖర ఫణీంద్ర, ఫిజికల్ డైరక్టర్స్ కె. అహ్మద్, హరిబాబు, దుర్గాదేవి, వివిధ విభాగాల అధిపతులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us