ప్రతిభా పురస్కారాలకు ఎంపికైన ఆదిత్య విద్యార్థులు

UPDATED 12th OCTOBER 2017 THURSDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు 2014 -16 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభా పురస్కారాలకు ఎంపికైనట్లు   సంస్థ వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గల 35 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులు 10 ప్రతిభా పురస్కారాలకు ఎంపిక కాగా, అందులో ఐదు పురస్కారాలను తమ సంస్థ విద్యార్థులు కైవసం చేసుకున్నారన్నారు. విద్యార్దులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2014 వ సంవత్సరం నుంచి ఈ పురస్కారాలను ప్రారంభించిందని, ప్రారంభం నుంచి మెరుగైన ఫలితాలు సాధిస్తూ జిల్లాలోనే అత్యుత్తమ సంస్థలుగా తమ విద్యా సంస్థలు ప్రతిభ చాటుతున్నాయన్నారు. తమ విద్యా సంస్థలు అనుసరిస్తున్న విద్యా విధానం, క్రమశిక్షణతో కూడిన నాణ్యతా ప్రమాణాలు, అత్యాధునికమైన ల్యాబ్, లైబ్రరీ సౌకర్యాలు, సుశిక్షితులైన, అనుభవజ్ఞులైన ఫాకల్టీ తదితర అంశాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ పురస్కారాలను కైవసం చేసుకున్న విద్యార్థులు ఆర్.ఎస్.ఎం. హర్షిక, పి. సీత, టి.ఎం.కె. సంధ్య, డి. భవిత, వి.వి.ఎస్.ఎస్.డి. మణికంఠలను ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.టి.వి.ఎస్.కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఎ.మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.                     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us