* గైట్ మేనేజింగ్ డైరెక్టర్ శశికిరణ్ వర్మ
* ముగిసిన రాష్ట్రస్థాయి ఎఫ్.డి.పి శిక్షణ
UPDATED 15th JUNE 2018 FRIDAY 9:00 PM
రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాలలో రెండు వారాలుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుల ఫ్యాకల్టీ డెవలప్ మెంట్ శిక్షణా కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన ముగింపు సభకు గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ హాజరై మాట్లాడుతూ వృత్తిలో నైపుణ్యాభివృద్ధికి శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. అధ్యాపకుడు నిరంతర విద్యార్థి అని, ఇటువంటి శిక్షణా కార్యక్రమాలకు హాజరుకావడం ద్వారా బోధనలో మరిన్ని మెళకువలను అలవర్చుకునేందుకు అవకాశం కలుతుందన్నారు. వివిధ ప్రాంతాలు, వేర్వేరు సంస్థలకు చెందిన అధ్యాపకులు ఒకచోట కలుసుకుని తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు మంచి వేదికలని అన్నారు. బోధనలో మరిన్ని మెళుకువలు నేర్చుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్న ఉద్దేశ్యంతో గత మూడు సంవత్సరాలుగా తమ కళాశాల అధ్యాపకులను చెన్నైలోని ఐఐటీకి శిక్షణా తరగతులకు పంపుతున్నామని అన్నారు. చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచర్స్ ట్రైనింగ్ రీసోర్స్ సంస్థ ప్రొఫెసర్, హెడ్ డాక్టర్ సి.ఆర్. నాగేంద్రరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు ఈ శిక్షణలో పాల్గొన్నారన్నారు. రెండు వారాలు పాటు జరిగిన ఈ శిక్షణా కార్యక్రమం అధ్యాపకులు వృత్తి నిర్వహణలో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 53 మంది శిక్షణ పొందారన్నారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి గైట్ ఎండి శశికిరణ్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గైట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. గోవర్ధన రామానుజం, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.







