UPDATED 1st APRIL 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామం శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితిచే శారదామాత మహాన్నదాన పధకం ద్వారా ఉచిత బియ్యం పొందుతున్న లబ్ధిదారుల సమక్షంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత తోటకూర సాయి రామకృష్ణ తమ 30వ వివాహ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సాయి రామకృష్ణ, గంగాభవాని దంపతులు, సమితి సభ్యులు, బియ్యం లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నువ్వుల హరనాధరావు, పెంటపాటి మల్లిఖార్జునరావు దంపతులు డాక్టర్ పండు, తోటకూర సూర్య ప్రభాకర్, నువ్వుల వెంకట్రాజు, తేలుగుంట్ల నరసింహారావు, తోటకూర సాంబశివరావు, సాయి రామకృష్ణ సోదరులు, తదితరులు పాల్గొన్నారు.







