UPDATED 8th JANUARY 2019 TUESDAY 7:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య డిగ్రీ కళాశాల ఫోరెన్సిక్ సైన్స్ ఎన్ఎస్ఎస్ విభాగం ఆయుష్కమ్ వైద్య శిబిరంలో భాగంగా మూడవ రోజు ఉచిత కంటి పరీక్షల ప్రత్యేక శిబిరం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి సంకురాత్రి ఫౌండేషన్ వైద్యులు డాక్టర్ దుర్గాప్రసాద్ బృందాన్ని అభినందించారు. గత ఇరవై సంవత్సరాలుగా నేత్ర వైద్యంలో ఉచిత సేవలు అందిస్తూ, సుమారు మూడు లక్షలకు పైగా శస్త్ర చికిత్సలు నిర్వహించిన కిరణ్ కంటి ఆసుపత్రి యాజమాన్యానికి కళాశాల ప్రిన్సిపాల్ ఇ. మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిబిరంలో నలభై మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అందులో ఎనిమిది మందికి జనవరి పదిహేడున ఉచితంగా కేటరాక్ట్ ఆపరేషన్ చేయడం జరుగుతుందని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ టి. ప్రవీణ్ తెలిపారు. రానున్న మరో మూడు రోజుల్లో నిర్వహించు ప్రత్యేక శిబిరాల్లో అవయవ దానం, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.







