UPDATED 5th DECEMBER 2018 WEDNESDAY 6:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ (గుంటూరు) ఆధ్వర్యంలో కేన్సర్ వ్యాధిపై అవగాహనా సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ వైద్యులు డాక్టర్ ప్రశాంత్ యార్లగడ్డ వివిధ రకాల కేన్సర్లు గురించి అవగాహన కల్పించడంతో పాటు జీవనశైలిలో మార్పుల ద్వారా వ్యాధి నిరోధక చర్యలపై అవగాహన కల్పించారు. నానాటికి కేన్సర్ వల్ల మరణాల శాతం పెరుగుతోందని, శారీరక శ్రమలేని జీవనశైలి, ఊబకాయం, కాలుష్య స్థాయిలు, పొగాకు, మద్యపానం, మారుతున్నఆహార అలవాట్లు ఈ వ్యాధి పెరుగుదలకు కారణాలని అన్నారు. క్రమం తప్పకుండా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిచుకోవాలి. కేన్సర్ నివారణ గురించి ప్రాధమిక దశలో గుర్తించేలా అవగాహన పెంచడానికి తమ సంస్థ ప్రయత్నిస్తోందని, ఆరోగ్యకరమైన జీవన విధానాల ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, సిహెచ్ సురేష్ కుమార్, పి. సుబ్బారావు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







