ఆదిత్య ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన

UPDATED 1st DECEMBER 2018 SATURDAY 5:30 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కళాశాలలకు చెందిన ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎయిడ్స్ అవగాహనా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిడ్స్ వ్యాధి నివారణపై శనివారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వాహన చోదకులు, ప్రయాణికులు, విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బందికి ఎయిడ్స్ వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్నికళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, ముఖ్యంగా యువత ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, భావిభారతాన్ని ఎయిడ్స్ రహితంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పెద్దాపురం మండలం కొండపల్లి గ్రామంలో ఇంటింటా, గ్రామంలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజబాబు, వివిధ విభాగాధిపతులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు శివకుమార్, జ్ఞానవర్జిన్, సి.హెచ్. భాస్కరరావు, జె. బాలమోహనరాజు, ఎం. సోమిరెడ్డి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, కళాశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us