ఆదిత్యలో మార్కెటింగ్ విభాగంలో ప్రత్యేక శిక్షణా తరగతులు

UPDATED 20th AUGUST 2018 MONDAY 6:30 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ విభాగంలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హైదరాబాడుకు చెందిన ప్రముఖ వక్త, మేధావి డాక్టర్ ఐ.పి. వెంకటేశ్వరావు హాజరై మాట్లాడారు. ప్రస్తుత మార్కెటింగ్ విభాగంలో సమకాలీన వ్యాపార అంశాలైన సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణ, సామాజిక వ్యవస్థాపకత వంటి అంశాలపై విద్యార్థులకు వివరించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ అధ్యాపక రంగంలో 26 సంవత్సరాల విశేష అనుభవాన్ని గడించి విద్యార్థులను చైతన్యవంతులుగా తయారుచేయడంలో ఆయన పాత్ర ప్రముఖమైందన్నారు. నేటి పోటీ ప్రపంచంలో వనరుల నిర్వహణ, స్థిరమైన అభివృద్ధి, కార్పోరేట్ బాధ్యత వంటి అంశాలను సమన్వయపరిచినపుడు మాత్రమే ఆర్ధికంగా ఎదగడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్ధాశర్మ, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us