UPDATED 15th JULY 2019 SUNDAY 9:00 PM
పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలో వేంచేసిఉన్న మరిడమ్మ అమ్మవారి ఆషాఢమాస జాతర మహోత్సవాల సందర్భంగా రెండవ ఆదివారం ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. వివిధ జిల్లాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వచ్చిన భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆలయ పరిసరాలు, పాత బస్ స్టాండ్, కాకినాడ - రాజమహేంద్రవరం రహదారి, సారావారివీధి తదితర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చైర్మన్ డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. భారీ సంఖ్యలో వాహనాలు రావడంతో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు సిఐ వి. శ్రీనివాసరావు, ఎస్ఐ వెలుగుల సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.







