ఆదిత్యలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

UPDATED 15th AUGUST 2017 TUESDAY 2:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో 71 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ప్రాణత్యాగాల ప్రతిఫలం ఈ స్వరాజ్యమని, దీనిని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఎన్నో వనరులు ఉన్నా మనదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్పబడుతోందని, కానీ అభివృద్ధి చెందిన దేశం మనదేశం అని చెప్పలేకపోతున్నామని అందుకు దేశంలో మన నాయకుల్లో అవినీతి, నిరాశావాదం మూలంగానే వెనుకబాటుతనం వెంటాడుతోందన్నారు. కళాశాల సెక్యూరిటీ సిబ్బంది, ఫిజికల్    ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఎం. శ్రీనివాసరెడ్డి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ డాక్టర్ శరభోజీ, క్యాంపస్ చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పి. కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us